ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 2,500 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. సారాను తయారు చేయడం, అమ్మడం నేరమని.. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెబ్ అధికారులు హెచ్చరించారు. ఈ దాడులలో సెబ్ అధికారులు సీఐ సోమయ్య, ఎస్ఐ మహబూబ్ వలి, సిబ్బంది పాల్గొన్నారు.
ఖాజీపురంలో 2,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - ఖాజీపురంలో నాటుసారా బట్టీలపై దాడులు వార్తలు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఖాజీపురంలో నాటుసారా కేంద్రాలపై సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. 2,500 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు .
బెల్లం ఊట ధ్వంసం