ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలో వైకాపా నాయకుల మధ్య విభేదాలులు రచ్చకెక్కాయి. యద్దనపూడి పోలీస్ స్టేషన్ వద్ద మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు, వైకాపా నాయకుడు దొడ్డ బ్రహ్మానందం తన అనుచరులతో నిరసనకు దిగారు. వైకాపాకు చెందిన వారే తనపై దాడికి ప్రయత్నించారంటూ.. ఆరోపించారు.
దొడ్డ బ్రహ్మానందంకు మద్దతుగా పర్చూరు నియోజకవర్గ మాజీ వైకాపా ఇన్ఛార్జి గొట్టిపాటి భరత్ కూడా స్టేషన్కు వచ్చి బైఠాయించారు. దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫలితంగా.. కాసేపు పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.