ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనికెళ్దామని తీసుకెళ్లింది.. ఇంటికొచ్చి లూటీ చేసింది - బెస్తవారిపల్లె వార్తలు

ప్రకాశం జిల్లాలో ఈ నెల 22వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే ఆషియా అనే మహిళ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

money gold recovery
సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : Dec 30, 2020, 7:01 PM IST

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట లో ఈ నెల 22న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆషియా అనే మహిళ పథకం ప్రకారం తన ఇంటి ఎదురుగా ఉన్న మహిళను కూలి పనికి వెళ్దామని తీసుకెళ్లింది. అనంతరం ఇంటి దగ్గర పనుందని.. వెంటనే వస్తానని చెప్పి ఇంటికొచ్చింది. సదరు మహిళ ఇంట్లోకి చొరబడిన ఆషియ.. నగలు, నగదు దొంగిలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 112 గ్రాముల బంగారం, 1.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details