ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చరవాణిలో కాల్ రికార్డింగ్ విన్న భర్తే అనుమానంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా త్రోవగుంట గ్రామానికి చెందిన బత్తుల సుమలతకు... కరవది గ్రామానికి చెందిన వాసుకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. మద్యానికి బానిసైన వాసు... నిత్యం ఆమెను వేధస్తుండటంతో ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అప్పటినుంచి సుమలత పిల్లలతో కలిసి పుట్టినిల్లైన త్రోవగుంటలో ఉంటుంది. ఇటీవల భార్య దగ్గరకు వచ్చిన వాసు తన చరవాణి పనిచేయడం లేదంటూ సుమలత ఫోన్ తీసుకున్నాడు. అందులోని కాల్ రికార్డింగ్స్‌లో వేరే వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడటం విని భార్యను హతమార్చాలనుకున్నాడు. డిసెంబర్ 30న బట్టలు కొందామని ఆటోలో భార్యను ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి... కొబ్బరి బోండాలు నరికే కత్తితో చంపేశాడు. మండల రెవిన్యూ అధికారి ముందు కత్తితో పాటు లొంగిపోయాడు. నిందితుడు వాసును మీడియా ముందు ప్రవేశ పెట్టిన ఒంగోలు డీఎస్పీ కేవీవీ మన్వీ ప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు.
మద్దిపాడులో మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు - మద్దిపాడు మండలంలో మహిళ హత్య కేసు
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తే ఆమెను హత్య చేసినట్లు ఒంగోలు డీఎస్పీ కేవీవీ మన్వీ ప్రసాద్ తెలిపారు.
![మద్దిపాడులో మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/01-January-2020/5555075_588_5555075_1577827459848.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5555075-588-5555075-1577827459848.jpg)
మద్దిపాడులో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు