అక్రమంగా గ్రానైట్ పలకలను తరలిస్తున్న వాహనాల పట్టివేత - moving granite slabs illegally news
అక్రమంగా గ్రానైట్ పలకలను తరలిస్తున్న వాహనాలను ప్రకాశం జిల్లా మార్టూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. లారీలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగొట్టి అక్రమంగా గ్రానైట్ పలకలను తరలిస్తున్న వాహనాలను ప్రకాశం జిల్లా మార్టూరులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. వే బిల్లులు లేకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహంచారు. ఈ దాడుల్లో ఏడు లారీలను పట్టుకున్నారు. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రానైట్ బండల కొలతల ప్రకారం అపరాధ రుసుం విధిస్తామని అధికారులు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో 11 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.