పోలీసుల తనిఖీలు..నగదు స్వాధీనం - పోలీసు తనిఖీలు
ప్రకాశం జిల్లా పర్చూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న రూ.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల తనిఖీలు
ఎన్నికల కోడు అమలులో భాగంగా ప్రకాశం జిల్లా పర్చూరులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని వై-జంక్షన్ రోడ్డులో చెక్ పోస్టు ఏర్పాటుచేసి, ఇంకొల్లు సి.ఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో ఓ కారులో తరలిస్తున్న రూ.75 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదును గుంటూరు నుంచి చీరాల సంతరావూరు యూనియన్ బ్యాంకుకు తరిలిస్తున్నామని సిబ్బంది తెలిపారు. అనంతరం సిబ్బంది సరైన పత్రాలు చూపడం వలన పోలీసులు నగదును తిరిగి అందిచారు.