ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం యర్లజర్లకు చెందిన గడతాటి నరసింహా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానీ, తన గురిచి పట్టించుకోవద్దనీ, తన భార్యా పిల్లలను బాగా చూసుకోవాలని తన అన్న శ్రీమన్నారాయణకు ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళనకు గురైన శ్రీమన్నారాయణ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ లక్ష్మణ్ స్పందించి, నరసింహా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చీరలా రోడ్డు వద్ద పొలాల్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి నరసింహా మద్యంలో ఎలుకల మందు కలిపి తాగటంతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. హుటాహుటీన అతడిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. తక్షణ చికిత్స అందటంతో నరసింహా ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. పోలీసులు సకాలంలో స్పందించటంతో యువకుడు ప్రాణాలు నిలిచాయి.
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రాణం కాపాడిన పోలీసులు - సిగ్నల్స్ ఆధారంగా కాపాడిన పోలీసులు
'నా గురిచి పట్టించుకోవద్దు... నా భార్యను పిల్లలను బాగా చూసుకో అన్నయ్యా' అంటూ ఆ యువకుడు తన అన్నయ్యకు ఫోన్ చేసి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనపై ఆ యునకుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సెలఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు ఎక్కడ ఉన్నదీ కనిపెట్టి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రాణాలు కాపాడిన పోలీసులు