ప్రకాశం జిల్లా అధికారులు నాటుసారా తయారీ కేంద్రాలపై కొరడా ఝలిపిస్తున్నారు. కొంతకాలంగా దాడులు చేస్తూ.. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. తాజాగా చీరాల మండలం రామ్ నగర్లో దాడులు నిర్వహించిన సెబ్ అధికారులు.. పూడ్చిపెట్టిన వెయ్యి లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ద్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై దాడులు.. వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - నాటుసారా స్థావరాలపై దాడులు
ప్రకాశం జిల్లా చీరాల మండలం రామ్ నగర్లో దాడులు నిర్వహించిన సెబ్ అధికారులు.. వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలను పాల్పడితే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. అధికారుల అదేశాల మేరకు దాడులు నిర్వహించామని.. నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి..Murder: ప్రియుడి మోజులో భర్తను చంపేసింది..