లాక్డౌన్ అమలులో ఉన్నా... విచ్ఛలవిడిగా ద్విచక్రవాహనాలు, కార్లలో తిరుగుతున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అత్యవసర పనుల నిమిత్తం పోలీసులు రాకపోకలను అనుమతిస్తున్నా... ఇదే అదనుగా కొంతమంది రోడ్లమీద చక్కర్లు కొడుతున్నారు. మాస్కులు లేకుండా ఇష్టారీతన ప్రవర్తిస్తున్నారు. డీఎస్పీ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు.. ఇలాంటివారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.
'అనవసరంగా బయటికి వస్తే కేసులే' - ఒంగోలులో బైకు కేసులు
ప్రకాశం జిల్లా ఒంగోలులో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఒంగోలులో వాహనాల తనిఖీలు