రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఫలితంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాటుసారా తయారీ ఊపందుకుంది. బేస్తవారిపేట మండలంలోని కోనపల్లి అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి వినియోగించే 1100 లీటర్ల బెల్లం ఊటను స్థానిక ఎస్ఐ ధ్వంసం చేశారు. నిబంధనలను అతిక్రమించి సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు - giddaluru news updates
రాష్ట్రంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగా భావించి కొందరు అక్రమార్కులు నాటుసారా తయారీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు