పేకాట శిబిరంపై ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు దాడులు చేశారు. చినగంజాం మండలం సంతరావురు సమీపంలోని పొలాల్లో పేకాట అడుతున్నట్లు సమాచారం రావటంతో దాడులు చేశామని పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.08 లక్షల నగదు, 14 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. 13 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.
పేకాట శిబిరంపై దాడులు.. రూ.1.08 లక్షలు స్వాధీనం - ప్రకాశం జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు
ప్రకాశం జిల్లా సంతరావురులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకుని.. రూ.1.08 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట శిబిరంపై దాడులు