ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామంలో నాటుసారాకు వినియోగించే 750 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నాటు సారా తయారీకి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నాటుసారా తయారు చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చినవారి పేర్లను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
నాటుసారా తయారీ కేంద్రంపై దాడి.. బెల్లం ఊట ధ్వంసం - natusara manufacturing plants news
నాటుసారా బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. సారా తయారీని సహించేదిలేదని ఎస్సై రవీంద్రారెడ్డి హెచ్చరించారు.
![నాటుసారా తయారీ కేంద్రంపై దాడి.. బెల్లం ఊట ధ్వంసం Police raids on Natusara manufacturing plants](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7775205-684-7775205-1593147643487.jpg)
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు
ఇవీ చూడండి..