ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలోని కోళ్ల ఫారం వద్ద పేకాట ఆడుతున్నారని.. గ్రామస్థులు ఎస్పీకి ఇచ్చిన సమాచారం మేరకు యద్దనపూడి ఎస్ఐ చౌదరి, ఇంకొల్లు ఎస్ఐ ప్రసాద్‌లు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోనికి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి 1.17 లక్షల రూపాయల నగదు, 5 బైక్‌లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట శిబిరంపై దాడులు.. లక్షల్లో నగదు స్వాధీనం, 11 మంది అరెస్టు - పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు తాజా వార్తలు
పేకాటశిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి 11 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి 1.17 లక్షల రూపాయల నగదు, ద్విచక్రవాహనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు.
పేకాటశిబిరంపై పోలీసుల దాడులు
TAGGED:
యద్దనపూడి లో జూదరుల అరెస్టు