పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్ - prakasam district latest news
మద్దిపాడు మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.71,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
![పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్ police raided a poker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9812470-497-9812470-1607446662560.jpg)
పేకాట స్థావరంపై దాడి
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గ్రోత్ సెంటర్లో పోలీసులు ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.71,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని.. కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. పేకాట ఆడినా, నిర్వహించినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.