వినాయకుడి ముందు పిల్లలు గిన్నెలు, బేసిన్లపై చప్పుడు చేస్తూ...గణపయ్యను సాగనంపుతూ సందడి చేస్తున్న ఈ దృశ్యం.. ప్రకాశం జిల్లా చీరాలలో నిమజ్జనం సందర్భంగా కనిపించింది. పోలీసులు గణేష్ నిమజ్జనానికి ఎలాంటి సౌండ్లు, బ్యాండ్లు పెట్టకూడదని ఆదేశాలు జారీ చేయగా... అక్కడి పిల్లలు ఇలా చేతికందిన గిన్నెలు, బేసిన్లు వంటి వస్తువులతో చప్పుడు చేసుకుంటూ బోలో..గణేష్ మహరాజ్‌కి జై అంటూ, నిమజ్జనానికి తీసుకెళ్లారు.
డీజే లేకపోతనేం..! గిన్నెలు ఉన్నాయిగా..! - police order
ఎక్కడయినా వినాయకుడి నిమజ్జనమంటే డిజిటల్ సౌండ్లు, బ్యాండు బాజాలతో ఘనంగా చేస్తారు. కానీ.. అక్కడ మాత్రం వినూత్నంగా...గిన్నెలు, బేసిన్లపై చప్పుడు చేస్తూ... గణపతిని నిమజ్జనానికి తరలించారు.
వినూత్నంగా గణపయ్య నిమజ్జనం