ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో లాక్డౌన్ కార్యక్రమాన్ని పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కొందరు ప్రజల తీరుతో వారి సహనం దెబ్బతింటోంది. అనవసరంగా ద్విచక్రవాహనాలతో రోడ్లపైకి వస్తూ వారి సహనానికి ప్రజలు పరీక్ష పెడుతున్నారు. ఇలాంటి వారికి పోలీసులు మరింత సహనాన్ని వ్యక్తం చేస్తూ.. కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. మార్కెట్లేవీ లేకున్నా కూడా.. పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లో కొందరు కూలీలను గమనించారు. వారికి నమస్కారం పెట్టి మరీ.. విజ్ఞప్తి చేశారు. ఇలా నిర్లక్ష్యంగా బయట తిరిగవద్దని కోరారు. కరోనా నియంత్రణ దిశగా సహకరించాలని వేడుకున్నారు.
గిద్దలూరులో పోలీసులు నమస్కారం పెట్టి మరీ..!
కరోనా కట్టడికి పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు. లాక్ డౌన్ ను సహనంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే కొంతమందితో వారికి విసుగు కలుగుతున్నా.. అంతకుమించిన సహనాన్ని ఇలా పోలీసులు ప్రదర్శిస్తున్నారు.
గిద్దలూరులో పోలీసుల నమస్కారం