ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్యాంగ వాలంటీర్ మృతిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం - వాలంటీర్ మృతి వార్తలు

ప్రకాశం జిల్లాలో దివ్యాంగ వాలంటీర్ భువనేశ్వరి మృతి ఘటనపై.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? అనే విషయం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. కుటుంబసభ్యులను సైతం విచారిస్తున్నారు.

police investigates on handicapped volunteer death at prakasam district
దివ్యాంగ వాలంటీర్ మృతిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

By

Published : Dec 20, 2020, 4:58 PM IST


ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో.. దివ్యాంగ వాలంటీర్ భువనేశ్వరి మృతిచెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాసరాజుపల్లెకు వెళ్లే దారిలో ట్రైసైకిల్ మీద వెళ్తూ మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఎవరైనా హత్యకు పాల్పడ్డారా అనే విషయం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చివరి సారిగా ఆమె చరవాణి నుంచి స్నేహితులకు ఇదే చివరి సందేశం అంటూ మెసేజ్​లు ఇవ్వడంతో.. ఆమె ఆత్మహత్య చేసుకుందనే కోణంలోనే పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ మేరకు ఆదివారం ఓఎస్డీ చౌడేశ్వరి , డిఎస్పీ ప్రసాద్​రావులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

అయితే భువనేశ్వరి మరణం పట్ల.. ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడం, దివ్యాంగుల సంఘాలు కూడా ఆందోళనలు చేయడంతో పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది. కేసును లోతుగా దర్యాప్తు చేసి విచారణ చేపట్టి.. ఆధారాలను సేకరించారు. కుటుంభ సభ్యులను కూడా విచారిస్తున్నారు. భువనేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details