అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొనకుండా ప్రకాశం జిల్లాలో తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం(mla's house arrest at prakasam district) చేశారు. చిలకలూరిపేటలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్టూరులో ఏలూరి సాంబశివరావు అరెస్టు(mla's house arrest at prakasam district due to maha padayatra) చేశారు.
అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌తో రాజధాని రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. రైతుల మహాపాదయాత్రకు అన్ని వర్గాల నుంచీ రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో మహా పాదయాత్ర సాగనుంది. అయితే.. పాదయాత్రలో పాల్గొనకుండా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
మహా పాదయాత్రకు ఆటాంకం కలిగించేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తున్నట్టుగా తెదేపా ఆరోపిస్తోంది. అయితే.. ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ కారణంగానే ఆంక్షలు విధించామని పోలీసులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం పాదయాత్రను ఆపాలని ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగా.. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేల గృహ నిర్బంధం(mla's house arrest at prakasam district) చేయడంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఓర్వలేకే అక్రమ అరెస్టులు: ఎమ్మెల్యే గొట్టిపాటి
మహా పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి వైకాపా ప్రభుత్వం ఓర్వలేకపోతోందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(mla Gottipati Ravikumar) అన్నారు. పోలీసుల అండతో.. ఎన్నికల కోడ్ సాకుతో నిర్బంధిస్తారా? అని ఎమ్మెల్యే గొట్టిపాటి ప్రశ్నించారు. మహాపాదయాత్ర.. రాజకీయ యాత్ర కాదని, అమరావతి ఆకాంక్ష యాత్ర అని పేర్కొన్నారు.
గృహనిర్బంధం అన్యాయం: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన.. మహా పాదయాత్రలో పాల్గొనకుండా గృహ నిర్బంధం చేయడం అన్యాయమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ధ్వజమెత్తారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పుకోనివ్వరా? అని నిలదీశారు. యాత్రకు ప్రజలు రాకుండా బారికేడ్లతో అడ్డుకుంటున్నారన్న ఏలూరి.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకే సాగుతామని అన్నారు.
ఇదీ చదవండి..
Maha Padayathra: ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం