ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం జంక్షన్ వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. పైన పంచదార బస్తాలు, కింద గుట్కా ప్యాకెట్లతో హైదరాబాద్ నుంచి వినుకొండకు గుట్కా రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా లారీని గుర్తించిన పోలీసులు... నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.25 లక్షలకుపైగా ఉంటుందని పేర్కొన్నారు. గుట్కా రవాణాకు పాల్పడ్డ నిందితులు వి.గోవింద్, ఎ.భాస్కర్‌రెడ్డి, కె.శివారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
భారీగా నిషేధిత గుట్కా పట్టివేత - prohibited gutka latest news update
నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం జంక్షన్ వద్ద తనిఖీల్లో భాగంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.25 లక్షలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రకాశంలో భారీగా నిషేధిత గుట్కా పట్టివేత
ఇవీ చూడండి...