ప్రకాశం జిల్లా కనిగిరిలో గుట్కాలను చిల్లర దుకాణాలకు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.75,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నిందితుడిని సూరిశెట్టి ఏడుకొండలు అనే వ్యక్తిగా గుర్తించారు. స్థానిక చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో అతను పట్టుబడ్డాడని.. పోలీసులు చెప్పారు. గుట్కాలను చీమకుర్తిలో కొనుగోలు చేసి కనిగిరిలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.