కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్సై శివకూమార్ ఆధ్వర్యంలో.. పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. మార్టూరు సమీపంలోని శాంతినగర్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలనీ... భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుల అవగాహన పాఠాలు - కరోనాపై మార్టూరు పోలీసుల అవగాహన
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నివారణకు పోలీసులు కృషి చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మాస్కులు ధరించటం, భౌతికదూరం పాటించటం వంటి అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు.
![గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుల అవగాహన పాఠాలు awareness program on corona virus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7813057-380-7813057-1593404187699.jpg)
గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుల అవగాహన పాఠాలు