ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని సారా స్థావరాలపై ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. తూర్పు బొమ్మలపురంలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడి - ప్రకాశం జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగడంతో పల్లెల్లో నాటుసారా తయారీ జోరందుకుంటోంది. అక్రమంగా సారా తయారు చేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా తూర్పు బొమ్మలపురంలో సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడి