ప్రకాశం జిల్లా చీరాలలోని ఎఫ్సీఐ గోదాముల సమీపంలో.. అక్రమంగా ఇసుక తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. రెండు టైర్ల బండ్లను, వాటికి ఉన్న నాలుగు ఎద్దులను సైతం పోలీస్ స్టేషన్ వద్దే ఉంచారు.
సాయంతం 6 గంటల తరువాత తహసీల్దార్ వద్దకు పంపించినట్టు పోలీసులు తెలిపారు. కానీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎద్దులకు ఆహారం అందించలేదని వాటి యజమానులు ఆవేదన చెందారు.