Volunteer Arrested In Prakasam district: ప్రకాశం జిల్లా పామూరులో అక్రమ మద్యం విక్రయిస్తూ వాలంటీర్ పట్టుబడ్డారు. సంక్రాంతి సందర్భంగా పామూరు మండలంలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మద్యం విక్రయిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో సెబ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గోవా, కర్ణాటకకు చెందిన 14 మద్యం బాటిళ్లు, బుల్లెట్ బండిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో వాలంటీర్ ఉన్నట్లు ముందు అధికారులు గుర్తించలేదు. నిందితుల్లో ఒకరిని విడుదల చేయాలని స్థానిక వైకాపా నేతల నుంచి ఒత్తిడి వచ్చింది. దర్యాప్తు ముమ్మరం చేయడంతో వారిలో వాలంటీర్ ఉన్నట్లు గుర్తించారు. వాలంటీర్‌ను కేసు నుంచి తప్పించాలని అధికారులపై ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం.
అక్రమ మద్యం సరఫరాలో వాలంటీర్ - ఏపీ నేర వార్తలు
Liquor Illegally Supplying in AP: సంక్రాంతి సందర్భంగా పామూరులో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఈ నేపథ్యంలో సెబ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గోవా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 14 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిలో ఓ వాలంటీర్ ఉన్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు.
ప్రకాశం జిల్లా పామూరు
Last Updated : Jan 11, 2023, 5:04 PM IST