ఒంగోలు కోర్టు.. ఇవాళ హైవే కిల్లర్ మున్నా కేసులో తుది తీర్పు వెలువరించింది. 12 మందికి ఉరి శిక్ష వేసింది. అయితే ఈ తీర్పు సమయంలో కోర్టు పరిసరాల్లో ఇద్దరి సంచారం అనుమానాలకు తావిస్తోంది. వీరిలో ఒకరు వరంగల్ చెందిన బ్రహ్మచారి, రెండో వ్యక్తి బీహార్‌కు చెందిన పవన్‌గా గుర్తించారు.
హైవే కిల్లర్ మున్నా కేసు తీర్పు సమయంలో కోర్టు పరిసరాల్లో ఇద్దరు అనుమానితులు! - హైవే కిల్లర్ మున్నా కేసు తీర్పు సమయంలో ఇద్దరు అరెస్టు న్యూస్
ఒంగోలు కోర్టు పరిసరాల్లో అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హైవే కిల్లర్ మున్నా కేసు తీర్పు వెలువడుతున్న నేపథ్యం వారు అక్కడ తిరుగుతుండటం అనుమానాలకు తావిస్తోంది.
హైవే కిల్లర్ మున్నా కేసు తీర్పు సమయంలో కోర్టు పరిసరాల్లో ఇద్దరు అనుమానితులు!
బ్రహ్మచారి కిరాయి హంతుకుడిగా రికార్డ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మున్నా కేసు తుది తీర్పు సమయంలోనే ఇక్కడకు ఎందుకు వచ్చారో పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:హైవే కిల్లర్ మున్నా కేసులో సంచలన తీర్పు.. 'నైలాన్ తాడుతో గొంతులు కోసేవాడు'
TAGGED:
ఒంగోలు క్రైమ్ న్యూస్