ప్రకాశం జిల్లా చీరాలలో మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నవారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కోవిడ్-19 ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక అధికారి రాజమోహన్ మాస్కులు ధరించకుండా బయట తిరిగిన 50 మందికి ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున జరిమానా విధించారు. కరోనాను అరికట్టడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. మాస్కులు ధరించని వారికి మొదటి తప్పుగా 100 రూపాయలు జరిమానా విధించామని తెలిపారు. మరోసారి మాస్కులు లేకుండా బయటకు వస్తే 1000 రూపాయలు జరిమానాతో పాటు జైలుకి కూడా పంపిస్తామని ఆయన హెచ్చరించారు.
మరోసారి మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా - చీరాలలో పోలీసుల జరిమానా
ప్రకాశం జిల్లా చీరాలలో మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నవారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున జరిమానా విధించారు. మాస్కులు లేకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
![మరోసారి మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా Police are penalizing those go out without masks in cheerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7859949-142-7859949-1593684803096.jpg)
చీరాలలో పోలీసుల జరిమానా