మహిళల రక్షణ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు అభయ్ వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సిద్దార్డ్ కౌశిల్ ఆధ్వర్యంలో చీరాలకు అభయ్ వాహనం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో చీరాల ఒకటవ పట్టణ సీఐ నాగమల్లీశ్వరరావు అభయ్ వాహనం పనిచేసే తీరుపై రైల్వేస్టేషన్ వద్ద మహిళలకు అవగాహన కల్పించారు. రాత్రి సమయాల్లో ఇబ్బందుల్లో ఉన్న మహిళలు నిర్భయంగా 100కు ఫోన్ చేస్తే.. వెంటనే అభయ్ వాహనం వచ్చి ఆ మహిళను గమ్యస్థానానికి చేరుస్తుందని తెలిపారు.
మహిళల రక్షణకు 'అభయ్'మిస్తున్న ఖాకీ - Abhay vehicle latest news in cheerala
మహిళల రక్షణకు మేము ముందుంటాం అంటూ అభయం ఇస్తున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశిల్ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం అభయ్ వాహనాలను ప్రవేశపెట్టారు. ఎటువంటి ఇబ్బంది ఎదురైనా... మహిళలు ఒంటరిగా ప్రయాణించే పరిస్థితులు లేకపోయినా వెంటనే 'డయల్ 100కు' ఫోన్ చెయ్యండి.. మీ గమ్యస్థానానికి సురక్షితంగా మేము చేరుస్తాం అంటున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు.
police abhay vehicle provide for womans in prakasam district