రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చూస్తానని ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారులు కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగ కల్పన, తాగు సాగు నీటి సమస్యలు, రైతుల సమస్యలు వంటి పది అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని విధులు నిర్వర్తిస్తానని కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు
జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ - pola bhaskar
ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా పోలా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు.

'విధుల్లోకి ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ పోలా భాస్కర్'
'విధుల్లోకి ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ పోలా భాస్కర్'