* ఈ ఏడాది సాగు లక్ష్యం ఎంత?
బోర్డు పరిధిలో ముగిసిన సీజన్‌లో 136 మిలియన్ల కిలోల ఉత్పత్తి లక్ష్యం ఇచ్చాం. వాతావరణ పరిస్థితులు కారణంగా రైతులు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 121 మిలియన్ల కిలోల వరకే దిగుబడి వచ్చింది. ఈ కారణంగానే వస్తున్న సీజన్‌లో ఈ లక్ష్యాన్ని తగ్గించి 115 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికే అనుమతిచ్చాం.
* రైతుకు గిట్టుబాటు ధర విషయంలో న్యాయం జరగడంలేదనే విమర్శ ఉంది?
మార్కెట్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని రైతులు సాగు విధానాలు మార్చుకోవాలి. దీనికి బోర్డు సహకరిస్తుంది. ప్రధానంగా రైతు నాణ్యమైన పంట సాగు చేయాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ ఇచ్చేలా మన పొగాకు ఉండాలన్నది బోర్డు ధ్యేయం. నాణ్యత పెంచుకుంటూనే... పంట ఖర్చు తగ్గించుకోవాలి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి రావాలి. ఈ దిశగా రైతులకు సాంకేతిక సహకారాన్ని బోర్డు అందిస్తుంది.
* బ్యార్న్ పరిధిలో సాగు విస్తీర్ణం తగ్గించడంపై రైతులు నష్టపోతామంటున్నారు?
బ్యార్న్ పరిధిలో 29 క్వింటాళ్ళకు మించి దిగుబడి చేయరాదన్నది నిబంధనే... కానీ రైతుల్లోనూ తప్పిదాలు ఉన్నాయి. ఒక రైతు తన బ్యార్న్ పరిధిలో ఎక్కువ విస్తీర్ణం వేస్తే, ఒకరు పూర్తిగా వేయరు. వేయని బ్యార్న్ పేరుతో అధిక దిగుబడి వేసేవారు విక్రయాలు సాగిస్తున్నారు. సాగు చేయని రైతుల వివరాలు నిజాయితీగా తమకు తెలియజేస్తే, వారి అనుమతులు రద్దు చేయడానికి వీలవుతుంది. అప్పుడు బ్యార్న్ పరిధి పెంచడానికి వీలవుతుంది. రైతు ఒక అడుగు ముందుకేస్తే, తామూ రెండడుగులు ముందుకేస్తాం.