ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లా వాసి రాంభూపాల్‌రెడ్డిని.. అభినందించిన ప్రధాని మోదీ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

MANN KI BAAT: మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న మార్కాపురం రాంభూపాల్‌రెడ్డిని అభినందించారు.

MANN KI BAAT
రాంభూపాల్‌రెడ్డిని అభినందించిన ప్రధాని మోదీ

By

Published : May 29, 2022, 8:35 PM IST

MANN KI BAAT: మన్‌ కీ బాత్‌లో ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి అభినందించారు. వందమందికి సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించారని.. పదవీవిరమణ తర్వాత వచ్చిన రూ.26 లక్షలను వారి ఖాతాల్లో వేశారని ప్రశంసలు కురిపించారు.

మార్కాపురం రాంభూపాల్ రెడ్డి గిద్దలూరులో ప్రాథమిక పాఠశాలలో టీచర్​గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. అయితే.. ఈ క్రమంలో పేదరికంలో చదువుతున్న విద్యార్థులపై మమకారం మాత్రం ఆయన మరువలేదు.

స్కూల్లో పనిచేస్తున్న సమయంలోనే పేద బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత తనకు వచ్చిన 26 లక్షల రూపాయల నగదును స్థానిక పోస్టాఫీస్​లో ఫిక్స్​డ్ డిపాజిట్ చేశారు. అనంతరం దానిపై వచ్చిన వడ్డీని సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పేద బాలికల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసి, వారికి డబ్బులు జమ చేశారు. నేటి మన్ కీ బాత్ కార్యక్రమంలో.. ఈ విషయమై రాంభూపాల్​రెడ్డిని ప్రధాని మోదీ ప్రశంసించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details