ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pigeons Betting: పావురాలను తీసుకొచ్చారు.. గాల్లో ఎగురవేశారు.. ఎందుకు ? - Training to pigeons

Pigeons Betting : ప్రకాశం జిల్లా కొత్తపల్లి సమీపంలో కొందరు పెద్ద సంఖ్యలో పావురాలను బాక్సుల్లో తీసుకొచ్చి గాల్లోకి వదిలారు. అన్ని కపోతాలను ఒక్కసారి వదలటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇలా.. ఎవరు... ఎందుకు చేశారు? అనే విషయం తెలియాల్సి ఉంది.

Pigeons Betting
పావురాలను బాక్సుల్లో తెచ్చారు.. ఎగురవేశారు..ఎందుకు ?

By

Published : Jan 29, 2022, 4:47 PM IST

Pigeons Betting: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి సమీపంలో పెద్ద సంఖ్యలో పావురాలను గాల్లోకి వదిలారు కొందరు. వాటిని ఆకాశంలో అలా గుంపులు గుంపులుగా చూసేందుకు ఆహ్లాదంగా ఉన్నా.. వారి పని పలు అనుమానాలకు తావిస్తోంది. వారు చెన్నై పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన నిర్వాహకులని తెలుస్తోంది. వారు పావురాలను లారీలో చిన్నచిన్న బాక్సుల్లో తీసుకొచ్చి గాల్లోకి వదలడం చర్చనీయాంశంగా మారింది. పావురాలను బెట్టింగ్ కోసం నిర్వాహకులు ఇక్కడ తీసుకొచ్చారా..? లేదంటే శిక్షణ ఇచ్చేందుకు తీసుకొని వచ్చారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

సాధారణంగా పావురాల బెట్టింగ్ నిర్వహించేవారు అనుకున్న ప్రాంతం నుంచి పావురాలను దూరంగా తీసుకొచ్చి గాల్లో వదులుతారు. ఏ పావురం అయితే అనుకున్న ప్రాంతానికి ముందుగా చేరుతుందో దానికి సంబంధించిన యజమాని గెలుపొందినట్లుగా భావిస్తారు. వారికి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తుంటారు. అయితే ఇది బెట్టింగా..? శిక్షణా..? అనే విషయంలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.

పావురాలను బాక్సుల్లో తెచ్చారు.. ఎగురవేశారు..ఎందుకు ?

ABOUT THE AUTHOR

...view details