చేతిసంచిలో పేలిన చరవాణి - icds
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ఓ అంగన్ వాడీ కార్యకర్త చరవాణి పేలిపోయింది. బ్యాటరీ వేడెక్కడంతో సెల్ ఫోన్ పేలిపోయింది.

ధ్వంసమైన ఫోన్, చేతి సంచి
పేలిన ఫోన్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్ వాడీ కార్యకర్త చరవాణి పేలిపోయింది. ఆ మహిళ చేతి సంచిలో ఉన్న మొబైల్ వేడెక్కి ఒక్కసారిగా పేలిపోయింది. త్రిపురాంతకం మండలం మిరియం పల్లెకు చెందిన అంగన్వాడీ కార్యకర్త.. ఎర్రగొండపాలెం కార్యాలయంలో సమావేశానికి వచ్చారు. బ్యాటరీ వేడెక్కిన సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు రావడంతో సంచిని బయటకి విసిరేశారు. ఫోన్ చేతిలో లేనందున ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.