ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం దైవలరావురు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ఈత కొట్టడానికి దిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కొరిసపాడు ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులు,అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గల్లంతైన వ్యక్తి కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెక్ డ్యామ్ లో భారీగా నీరు ఉండటంతో జేసీబీ సాయంతో డ్యామ్ కు గండి కొట్టి నీళ్లు బయటకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. వెంకటరెడ్డి(40) ట్రాక్టర్ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈతకు దిగి వ్యక్తి గల్లంతు - prakasam dst swimming news
ఈత సరదా ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం దైవలరావురు గ్రామంలో ఈతకు చెక్ డ్యాం లో దిగి గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గల్లెతైన వ్యక్తిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.
person missing in prakasam dst when swmming at checkdam