కూలీ పనికి వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలం ఎండురివారి పాలెం సమీపంలో జరిగింది. మృతి చెందిన వ్యక్తి గణపవరం గ్రామానికి చెందిన యేసయ్యగా పోలీసులు గుర్తించారు. ఇతను పొట్టకూటి కోసం చెరకు కొట్టేందుకు వెళ్లేవాడు. కరోనా నేపథ్యంలో పనులు లేక గత ఐదు నెలలుగా కూలీ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో గణపవరం నుంచి సంగం తండా వరకు జరుగుతున్న రోడ్డు పనులకు కూలీకి వెళ్లాడు. రోడ్డు సర్వే చేస్తుండగా యేసయ్య చేతిలో ఉన్న అల్యూమినియం పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తాకింది. దీంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు.
కూలీ పని చేస్తుండగా విద్యుదాఘాతం..వ్యక్తి మృతి
గణపవరం గ్రామానికి చెందిన యేసయ్య రోడ్డు పనులకు కూలీగా వెళ్లాడు. ఎండురివారిపాలెం సమీపం వద్ద రోడ్డు పనులు చేస్తుండగా... 11 కేవీ విద్యుత్ తీగలు అతని చేతిలోని అల్యూమినియం పైపుకు తాగి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
ఎండురివారిపాలెం సమీపం వద్ద రోడ్డు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి