కరోనా వ్యాధి నిర్మూలనకై అందరు ఇళ్ళలోనే ఉండాలని.. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును ఆసరాగా తీసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలో కొంత మంది అక్రమార్కులు నాటాసారాయి విక్రయాలను జరుపుతున్నారు. ప్రభుత్వ ఆధికారులను సైతం గ్రామంలోకి రానివ్వకుండా గ్రామ సరిహద్దుల్లో ముళ్లకంచెలు వేసి.. సారాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు వారందరిని చీరాల రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు.
చీరాల మండలం రామనగర్, న్యూకాలనీ, ఆదినారాయణపురం ప్రాంతలలో నాటుసారాయి విక్రయాల స్థావరాలపై అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలోకి రానివ్వకుండా ముళ్ల కంచెలు వేసి ఇబ్బందులకు గురి చెస్తున్నారని ఆ ఊరికి చెందిన వారే ఫిర్యాదు చేసిన మేరకు చర్యలు తీసుకున్నారు. దర్యాప్తులో అసలు విషయాన్ని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.