ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో కోతుల బెడదతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉట్ల స్తంభాల, వస్తాద్ గారి వీధుల్లో వానరాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇంటి పరిసరాలల్లో తిరుగుతూ... అందిన వస్తువులను తీసుకెళ్తున్నాయి. కోతులు సంచరిస్తున్నప్పుడు బయటికి వస్తే దాడి చేస్తాయని స్థానికులు భయపడుతున్నారు.
జనసంచారంలోకి వానర దండు... భయపడుతున్న ప్రజలు - monkeys roaming on streets news
అడవుల్లో తిరగాల్సిన వానరాలు కాలనీల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతున్నాయి. దొరికిన తినుబండారాలను తీసుకెళ్తూ..అడ్డువచ్చిన వారిపై దాడి చేస్తున్నాయి.

వీధుల్లో సంచరిస్తున్న వానరసైన్యం