ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు పక్కనే చెత్త.. దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు - ప్రకాశం జిల్లా వార్తలు

ఎవరైనా ఆ రహదారి వెంట వెళ్ళాల్సి వస్తే ముక్కు మూసుకోవాల్సిందే. ఊర్లోని చెత్తంతా అక్కడే ఉంటుంది. ఒక పక్క కరోనా విజృంభిస్తుంటే.. ఈ చెత్త వల్ల రోగాల బారిన పడతామని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ప్రాంతం ప్రకాశం జిల్లా చీరాలలోని కుందేరు కాలువ వద్ద ఉంది.

praksam district
చెత్త దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

By

Published : Jul 25, 2020, 5:41 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలోని రామాపురం వెళ్లే రహదారిలో కుందేరు కాలువ వద్ద పట్టణంలో సేకరించిన చెత్తను మున్సిపల్ సిబ్బంది అక్కడ పడేస్తున్నారు. దీంతో ఆప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతుంది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రామాపురంలో డంపింగ్ యార్డ్ నిర్మించారు. కానీ, పట్టణంలోని చెత్తను గొల్లపాలెంలోని భాష్యం స్కూలు పక్కకు తరలిస్తున్నారు. అసలే కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని... చెత్త వేయటం వల్ల రోగాల బారిన పడతామని భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఇక్కడ చెత్తవేయకుండా రామపురంలోని డంపింగ్ యార్డుకు తరలించాలని ఈ ప్రాంతప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details