ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి: జయప్రకాష్‌ నారాయణ - స్వర్ణ ప్రకాశం పుస్తకాన్ని ఆవిష్కిరంచిన జయప్రకాశ్ నారాయణ

Jayaprakash Narayana: ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ‘ప్రకాశం నామకరణ స్వర్ణోత్సవాల’లో.. లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ పాల్గొన్నారు. సమస్యలు తీర్చాలని అర్జీలిచ్చి అడుక్కోకుండా.. ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని అన్నారు. అనంతరం ‘స్వర్ణ ప్రకాశం’ పుస్తకావిష్కరణ చేశారు.

people should live with self respect says lok satta party president Jayaprakash Narayana
ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలి: జయప్రకాష్‌ నారాయణ

By

Published : Jul 3, 2022, 9:24 AM IST

Jayaprakash Narayana: సమస్యలు తీర్చాలని అర్జీలిచ్చి అడుక్కోకుండా.. ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ‘ప్రకాశం నామకరణ స్వర్ణోత్సవాల’ సందర్భంగా శనివారం నిర్వహించిన ‘స్వర్ణ ప్రకాశం’ పుస్తకావిష్కరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటు విలువను తెలుసుకొని సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తరచూ అర్జీలు ఇచ్చి అడుక్కున్నే పరిస్థితి తెచ్చుకోకుండా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. అలా కానిపక్షంలో ఆత్మగౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

పట్టణీకరణ అవసరమేనని, అయితే పట్టణాల్లోనే అన్నీ ఉంటాయనే భావనతో వలస పోకూడదని సూచించారు. 25 వేల జనాభాకు ఒక గ్రామాన్ని ఏర్పరుచుకొని స్థానిక నాయకత్వంతో అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. సభలో ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, పుస్తక రచయిత సంజీవరావు, లయోలా కళాశాల రిటైర్డ్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ గుమ్మా సాంబశివరావు, రచయిత పాటిబండ్ల ఆనందరావు, ప్రముఖ వైద్యులు చుంచు చలమయ్య, ఉన్నం జ్యోతి వాసు, సూర్యకుమారి మాట్లాడారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details