కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్ఐ శివకుమార్ అన్నారు. పట్టణంలో అనవసరంగా తిరుగుతున్న వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మాస్కులు పెట్టుకోకుండా ఆటోలో ప్రయాణిస్తున్న వ్యవసాయ కూలీలకు వైరస్ గురించి అవగాహన కల్పించారు. పనులు చేసుకునే సమయంలో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా, అనవసరంగా రహదారులపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
'కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి' - ప్రకాశం జిల్లా నేటి వార్తలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్త చర్యలు పాటించాలని మార్టూరు ఎస్ఐ అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి గురించి అవగాహన కల్పిస్తున్న మార్టూరు ఎస్ఐ