ప్రకాశం జిల్లా దర్శిలో ఒక్కసారిగా రోడ్లపైకి జనం గుంపులు గుంపులుగా వచ్చారు. ఏ ఒక్కరూ కూడా భౌతికదూరం పాటించటం లేదు. మాస్కులు కూడా అంతంత మాత్రంగానే ధరించారు. శ్రావణ మాసం కావటంతో పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లోని ప్రజలు పెళ్లి పనుల నిమిత్తం దర్శి పట్టణానికి విచ్చేశారు. కానీ కరోనా నియమాలు మాత్రం తుంగలో తొక్కేశారు. రోడ్లపై ఉన్న ప్రజల రద్దీనీ చూసి పరిస్తితి చేయిదాటి పోతుందేమోనని గ్రహించిన పోలీసులు దుకాణాలను మూయించి పరిస్థితిని అదుపుచేశారు.
కరోనా నా...అయితే మాకేంటి భయం..! - no carona fear
ఒకవైపు కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో విధాలుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రచారం చేస్తూనే ఉన్నాయి. అయినా చాలామంది పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనమే ప్రకాశం జిల్లా దర్శిలో విచ్చలడివడిగా తిరుగుతున్న జనం.
![కరోనా నా...అయితే మాకేంటి భయం..! praksam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8216645-823-8216645-1596013708450.jpg)
దర్శి రోడ్ల పై విచ్చలవిడిగా సంచరిస్తున్న ప్రజానీకం.........
కరోనా మాట దేవుడెరుగు పోలీసులు చేసే హడావుడి భయబ్రాంతులకు గురి చేస్తుందని పలువురంటున్నారు. పెళ్లి సామాగ్రి కొనుగోలు కోసం వస్తే నిరుత్సాహంతో తిరిగి వెళ్తున్నామంటున్నారు.