ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఎల్ఈఎఫ్ నగర్లో నివాసముంటున్నాడు హనుమంతరావు. భవన నిర్మాణ కార్మికుడిగా కార్మిక శాఖలో సభ్యత్వం ఉంది. 2017 డిసెంబర్ 4వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగి కాలికి గాయమైంది. అతనికి తాత్కాలిక భృతి కింద నెలకు రూ. 3వేల చొప్పున మూడు నెలల పాటు కార్మిక శాఖ సాయం అందించింది. ఆ తరువాత అతనికి భృతి అందలేదంటూ.. 1100 నెంబరుకు ఫోన్ చేసి తన వివరాలను హెల్ఫ్ లైన్ కి తెలిపారు.
'బతికే ఉన్నానని ధ్రువపత్రం తీసుకెళ్లినా వినట్లేదు' - ప్రకాశం జిల్లాలో బతికున్న మనిషిని చంపేశారు
హనుమంతరావు తనకి ప్రమాదం జరిగి మూడేళ్లు అవుతోంది. భవన నిర్మాణ కార్మికుడిగా కార్మిక శాఖలో సభ్యత్వం ఉన్న కారణంగా గతంలో తాత్కాలిక భృతి కొద్దిరోజులపాటు అందుకున్నాడు. ఆ తరువాత డబ్బులు రావడంలేదని హెల్ఫ్ లైన్ కు ఫోన్ చేశాడు. ఇప్పుడు కరోనా సమయంలో ఇబ్బందిపడుతున్నాని మళ్లీ భృతికోసం తనపేరు నమోదు చేసుకునేందుకు కార్యాలయంలో సంప్రదించగా.. చనిపోయిన వారి జాబితాలో తన పేరుచూసి షాక్ అయ్యాడు. నేను బతికి ఉన్నాను అంటూ ధ్రువపత్రం తీసుకెళ్లినా అధికారులు వినట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇప్పుడు కరోనా సమయంలో కుటుంబ పోషణ భారంగా ఉందని సాయం కావాలని మళ్లీ విన్నవించారు. అద్దంకి కార్మిక కార్యాలయంలో సంప్రదించగా.. పేరు నమోదు చేసేందుకు వెబ్ సైట్ లో అతని పేరు డెత్ క్లయిమ్ కింద ఉంది. దీంతో పేరు నమోదు చేసుకోలేము సారీ అని చెప్పేశారు అధికారులు. రెవెన్యూ అధికారుల నుంచి బతికే ఉన్నానంటూ ధ్రువపత్రం తీసుకొచ్చారు హనుమంతరావు. అయినా ఫలించలేదు. పేరు నమోదు చేసేందుకు వీలు కాదని చెప్పేస్తున్నారు. సహాయ కార్మికశాఖ అధికారి కోటేశ్వరరావుని వివరణ కోరగా.. హెల్ప్ లైన్ లోనే సరి చెయ్యాలి అని తెలిపారు. తనకు న్యాయం చేయాలని హనుమంతరావు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:కేబినెట్ భేటీ: కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ
TAGGED:
ప్రకాశం జిల్లా వార్తలు