ఒంగోలులోని దర్శిలో మంచినీటి కొరత ఏర్పడింది. ఈ సమస్యను ఈటీవి భారత్... ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మంచి స్పందన లభించింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఈ విషయాన్ని తెలుసుకుని దర్శిలోవున్న తన వ్యక్తిగత అనుచరునితో సంభాషించి... ప్రస్తుతం ఉన్న శుద్ధజలకేంద్రంలోని మిషనరీని అక్కడ నుండి తొలగించి అదే ఏరియాలో మరోచోట ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక ప్రజలకు మంచినీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని...రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదంటున్నారు స్థానికులు.
ప్రజాసమస్యకు లభించిన పరిష్కారం - ongole
ఈటీవి భారత్‌లో ప్రచురితమైన "దర్శి శుద్ధ జలకేంద్రానికి రాజకీయ రంగులు" శీర్షికకు మంచి స్పందన లభించింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు విషయం తెలుసుకొని... అదే ఏరియాలో మరో చోట శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రజాసమస్యకు లభించిన పరిష్కారం
ఇది చూడండి: బుమ్రాతో రిలేషన్‌షిప్‌పై అనుపమ క్లారిటీ