ప్రకాశం జిల్లా గిద్దలూరులో చౌకధరల దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా లబ్ధిదారులకు వాలంటీర్లు కూపన్లు అందజేశారు. నిర్ణీత సమయంలో సరకులు తీసుకోవడానికి రావాలని సూచిస్తున్నారు. ఫలితంగా రేషన్ దుకాణాల వద్ద రద్దీ తగ్గింది.
భౌతిక దూరం పాటిస్తాం.. ఆదర్శంగా నిలుస్తాం!! - people fallows physical distance
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదల కోసం ప్రభుత్వం బియ్యం, పప్పు ధాన్యాలను పంపిణీ చేస్తోంది. వీటిని తీసుకోవడానికి వచ్చే లబ్ధిదారులతో రేషన్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇందుకు భిన్నంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో కార్డుదారులు భౌతిక దూరం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
గిద్దలూరులో భౌతిక దూరం పాటిస్తూ సరకులు తీసుకుంటున్న ప్రజలు