ప్రకాశం జిల్లా చీరాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రజలను గందరగోళానికి గురిచేసింది. పేరాల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈరోజు టీకా వేస్తున్నారని వాలంటీర్లు చెప్పటంతో.. ఉదయాన్నే జనం బారులు తీరారు. వైద్య సిబ్బంది వచ్చి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి డోసు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. దీంతో వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు నిరాశ చెందారు. ఉదయం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాక్సిన్ కేంద్రానికి భారీగా జనం.. లేదని చెప్పడంతో నిరాశ
ప్రకాశం జిల్లా చీరాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. టీకా ఇస్తున్నామని వాలంటీర్లు చెప్పటంతో వ్యాక్సిన్ కేంద్రంలో జనం బారులు తీరారు. వ్యాక్సిన్ ప్రభుత్యోద్యోగులకు మాత్రమే అని చెప్పటంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.
వ్యాక్సిన్ కోసం బారులు తీరిన జనం
పేరాల ఉన్నత పాఠశాలలోని టీకా కేంద్రంలో పేరు నమోదు చేసుకోవడానికి ఒక కౌంటర్, వ్యాక్సిన్ వేయటానికి ఒక కౌంటర్ మాత్రమే ఉంది. దీంతో వచ్చిన జనం భౌతిక దూరం పాటించకుండా గుమికూడారు. టీకా కోసం వస్తే కొవిడ్ వస్తుందేమోనని భయాందోళనకు గురయ్యారు. వాలంటీర్లు సరైన సమాచారం అందించకపోవటంతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:కరోనా ఆయుర్వేద మందు కోసం పోటెత్తిన జనం..ప్రారంభమైన కాసేపటికే నిలిపివేత