ఒంగోలులో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నా.. ప్రజలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా బయట సంచరిస్తున్నారు. నేడు ఆదివారం కావటంతో బస్టాండ్ సమీపంలోని కొత్త కూరగాయలు మార్కెట్ లో ప్రజలు తాకిడి ఎక్కువైంది. చాలామంది మాస్క్, భౌతిక దూరం వంటి కనీస నియమాలు పాటించటం లేదు.
చికెన్ దుకాణాలు సైతం ఆదివారం మూసివేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు. కానీ... పాత మార్కెట్ సమీపంలో అక్కడక్కడా మాంసం దుకాణాల్లో దొంగతనంగా విక్రయాలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక... ప్రజలు అధిక సంఖ్యలో కొనుగోలు చేయటానికి బయటకి వస్తున్నారు.