ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే వారికి ఇబ్బందులు తప్పడంలేదు. చినుకు పడితే కార్యాలయం అంతా బురదమయంగా మారుతుంది. కార్యాలయానికి వెళ్లాలంటే భయపడుతున్నామని జనం వాపోతున్నారు. జారి కింద పడిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. నిత్యం 21గ్రామ పంచాయతీల నుంచి ప్రజలు ఏదో ఒక పని మీద ఇక్కడకు వస్తుంటారని... ఈ బురద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, కార్యాలయ సిబ్బంది కోరుతున్నారు.
చినుకు పడితే ఆ తహశీల్దార్ కార్యాలయం అంతా బురదే! - markapuram tahasildar office lo burada
చినుకు పడితేనే ఆ ప్రభుత్వ కార్యాలయం బురదమయం. వర్షాలు పడితే మార్కాపురం తహశీల్దార్ కార్యాలయానికి ప్రజలు రావాలంటేనే భయపడుతున్నారు.
![చినుకు పడితే ఆ తహశీల్దార్ కార్యాలయం అంతా బురదే!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4821175-818-4821175-1571660219211.jpg)
markapuram tahasildar office filled with mud
చినుకు పడితే.. ఆ తహసీల్దార్ కార్యాలయం అంతా బురదే!
Last Updated : Oct 22, 2019, 5:05 PM IST