ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో రాత్రి పగలు అని తేడా లేకుండా దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. వీటిని పరిశీలించిన పోలీసులు బాగా తెలిసిన వారు, స్థానికులే చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒక నెల వ్యవధిలోనే ...నాగులచెట్టు వీధిలో గల వెంకటాచారి ఇంట్లో, మరుసటి రోజు వస్తాద్ వారి వీధిలోని షేక్ ఖాసింవలి ఇంట్లో దొంగలు పడి నగదుతో పాటు ఆభరణాలు దోచుకెళ్లారు. వీరాంజనేయ ఆభరణాల దుకాణంలో పట్టపగలే చోరీకి పాల్పడి... పది లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయం చేశారు. ఇలా పట్టణంలో వరుస చోరీలు జరగడం ప్రజలను కలవరపెడుతోంది.
భయపెడుతున్న వరుస దొంగతనాలు - భయపెడుతున్న వరుస చోరీలు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రజలను.. వరుస దొంగతనాలు భయపెడుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో భయపెడుతున్న వరుస చోరీలు
TAGGED:
భయపెడుతున్న వరుస చోరీలు