ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలోని కొందరు పెన్షనర్లు.. నిరసన చేపట్టారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తమ పింఛన్లు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం గ్రామానికి చెందిన పెన్షనర్లను ఇతర గ్రామాలకు చెందిన వారిగా బదిలీ చేశారన్నారు. ఇటు అధికారులు.. అటు గ్రామ నాయకుల ఇబ్బందులతో ఇబ్బందులకు లోనవుతున్నామని అధికారుల వద్ద వాపోయారు. ఏంపీడీఓకు.. తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
'మా పింఛన్లను అక్రమంగా తొలగించారు.. న్యాయం చేయండి' - addanki latest news
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన పెన్షనర్లు ధర్నా చేపట్టారు. తమ పింఛన్ అక్రమంగా తొలగించారంటూ ఆవేదన చెందారు.
పెన్షన్ దారులు నిరసన