ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బతికుండగానే చంపేశారు.. పామూరులో పింఛన్​దారుల ఆందోళన

Pensioners Protest: పింఛన్​ రావడం లేదని వాలంటీర్లను ప్రశ్నించిన బాధితులకు గట్టి షాక్​ తగిలింది. పింఛన్​దారులు మరణించినట్లు నమోదు కావడంతో పింఛన్​ ఆగిపోయిందని వాలంటీర్​ తేల్చిచెప్పారు. ఈ విషయం విని ఖంగుతున్న లబ్ధిదారులు.. మరణించినట్లు ధృవీకరణ పత్రం ఇస్తే ఎల్​ఐసీ క్లెయిమ్​ చేసుకుంటామని కౌంటర్​ ఇచ్చారు.

pamuru
pamuru

By

Published : Aug 5, 2022, 3:23 PM IST

Updated : Aug 5, 2022, 5:03 PM IST

PROTEST: ప్రకాశం జిల్లాలోని పామురు మండల పరిషత్ కార్యాలయం వద్ద పింఛన్‌దారులు ఆందోళనలు నిర్వహించారు. అన్యాయంగా 36 మంది వృద్దాప్య,చర్మ, డప్పు కళాకారుల పింఛన్‌ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వాలంటీర్‌ను లబ్ధిదారులు ప్రశ్నించగా.. మరణించినట్లు నమోదు కావడంతో పింఛన్‌ నిలిపివేశారని సమాధానమిచ్చాడు. అనంతరం మరణించారంటూ పింఛన్లు తొలగించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. దీనిపై లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బతికుండగానే మరణించినట్లు సృష్టించి పింఛన్‌ తొలగించారని ఆరోపించారు. మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తే ఎల్‌ఐసీ క్లెయిమ్‌ చేసుకుంటామని బాధితులు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారి లేకపోవడంతో పింఛన్​ తొలగింపుదారులు బయటే వేచి ఉన్నారు.

బతికుండగానే చంపేశారు.. పామూరులో పింఛన్​దారుల ఆందోళన
Last Updated : Aug 5, 2022, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details