చీరాల ఎమ్మెల్యే కరణం ఇంట్లో పింఛన్ల శిబిరం - చీరాల ఎమ్మెల్యే కరణం ఇంట్లో పింఛన్ల శిబిరం
అర్హులైన వారికి పింఛన్లు తొలగించటం దారుణమని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల రామకృష్ణాపురంలో కరణం బలరామకృష్ణమూర్తి నివాసంలో తొలగించిన పింఛనుదార్ల వివరాలు సేకరించేందుకు శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున పింఛనుదారులు వచ్చి వివరాలు అందచేశారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కరణం బలరాం హామీ ఇచ్చారు.
పింఛనుదారుల వివరాలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి